6 May, 2026 | 5:18 PM

రియల్ డమల్ అమ్మేందుకు సిద్ధం కొనేవారే లేరు

06-05-2026 04:29 PM

బోథ్,(విజయక్రాంతి): నూతనంగా ఏర్పాటైన సోనాల మండలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములను కొనుగోలు చేసి ప్లాట్లుగా చేస్తున్నారు. అయితే స్థానికంగా మంచి డిమాండ్ ఉంటుందని కొంతమంది మధ్య దళారీలు వివిధ ప్రాంతాలలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చెప్పడంతో మహారాష్ట్ర. ఆదిలాబాద్ నిజామాబాద్ ప్రాంతాల నుండి వచ్చిన వారు భూములను కొనుగోలు చేశారు. దాదాపు నాలుగున్నర ఎకరాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెట్టుబడును పెట్టి ఇంద స్థలాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది.

అయితే డిటిపిసి అనుమతులతో చేపడుతున్న ఈ ప్లాట్ల వ్యాపారం పెట్టుబడిదారులు మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారం కొనసాగుతుందని అనుకున్నారు. అకస్మాత్తుగా భూములకు ధరలు పడిపోవడంతో పాటు ఇండ్ల స్థలాలకు ధరలు లేకపోవడంతో పెట్టుబడులు పెట్టినవారు ఆందోళన కు గురవుతున్నారు. అనుమతులు లీగల్ మిగతా అంతా ఇల్లీగల్, డిటిపిసి అనుమతులు తెచ్చుకున్న రియల్ ఎస్టేటర్లు అనుమతులు లేకుండానే అడవుల్లో నుండి మొరం బండరాయిని తీసుకువచ్చి రోడ్లు వేయడం జరిగింది.

ఈ తతంగం అంతా చూస్తున్న అధికారులు కన్నులు ఉండి లేనివారిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్లాట్లు పూర్తిస్థాయిలో సిద్ధం కాకముందే కొంతమంది వ్యాపారులు విక్రయాలకు పాల్పడుతున్నారు. అధికార యంత్రాంగం ఈ వ్యవహారాన్ని ఏమాత్రం పట్టించుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి. కుప్పకూరిన వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూరడంతో కొంతమంది వ్యాపారులు ఆందోళన చేస్తున్నారు. ప్లాట్ల ధరలను అందనంత ఎత్తులో ఉండడం వల్ల కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదు.దీంతో తమ వ్యాపారం. ఏ విధంగా సాగుతుందోనని ఆందోళన చేస్తున్నారు. వారికి కొంతమంది రాజకీయ నాయకులు సైతం మేమున్నామంటూ లోలోపల మద్దతునిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది