బలహీన వర్గాల పిల్లలకు ప్రైవేటులో ఉచిత విద్య కల్పించాలి
26-05-2026 02:48 PM
బీసీ పొలిటికల్ జేఏసీ
నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయంలో బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా అధ్యక్షులు అరవింద్ చారి, మహిళా అధ్యక్షులు శ్రీవిద్య గౌడ్ డీఈఓ రమేష్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఆర్‌టీఈ చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను బలహీన వర్గాలు, అనాధలు, సింగిల్ పేరెంట్ పిల్లలకు కేటాయించి ఉచిత విద్య, ఫీజుల మినహాయింపు, పుస్తకాలు, యూనిఫాంలు అందించాలని కోరారు. ఫీజుల పేరుతో వేధించే పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






