26 May, 2026 | 3:33 PM

ఢిల్లీలో కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ జాతీయ సమావేశం

26-05-2026 02:47 PM

పాల్గొని నియామక పత్రం అందుకున్న బోడ స్వామి .

చిట్యాల, మే 26 (విజయక్రాంతి): ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో  “నేషనల్ మీటింగ్ ఆఫ్ డీసీసీ చైర్‌ పర్సన్స్ అండ్ ఎస్సీ డిపార్ట్మెంట్”(Congress SC Department National Conference) సమావేశం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఎస్సీ డిపార్ట్మెంట్ జాతీయ అధ్యక్షులు రాజేంద్ర పాల్ గౌతమ్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్లు సమావేశానికి హాజరయ్యారు.

ఇందులో భాగంగా నల్గొండ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ బోడ స్వామి పాల్గొన్నారు. సమావేశం అనంతరం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్లకు నియామక పత్రాలను ఎస్సీ డిపార్ట్మెంట్ జాతీయ అధ్యక్షులు రాజేంద్ర పాల్ గౌతమ్ , తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగరి ప్రియతమ్, మానకొండూరు ఎమ్మెల్యే మరియు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ బోడ స్వామి తన నియామక పత్రాన్ని స్వీకరించారు. పార్టీ బలోపేతంతో పాటు ఎస్సీ వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు.