26 May, 2026 | 3:33 PM

కోనరావుపేటలో వివోఏల నిరసన దీక్షకు సీఐటీయూ మద్దతు

26-05-2026 02:45 PM

కోనరావుపేట, మే 26 (విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రంలో వివోఏలు చేపట్టిన నిరసన దీక్షకు సీఐటీయూ నాయకులు(CITU Leaders) ఎగమాంటి ఎల్లారెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా వివోఏలను మోసం చేసిందని ఆరోపించారు.

ప్రస్తుతం కేవలం రూ.5 వేల వేతనంతో వివోఏలతో వెట్టిచాకిరీ చేయించడం అన్యాయమని మండిపడ్డారు. వెంటనే వివోఏలకు రూ.25 వేల గౌరవ వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వివోఏల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తక్షణ పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ నిరసన కార్యక్రమంలో వివోఏలు, సీఐటీయూ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.