జిన్నారంపైన అంతకక్ష ఎందుకు....?
ఎమ్మెల్యే పై జిన్నారం కాంగ్రెస్ నాయకులు ఫైర్
జిన్నారం/ అమీన్ పూర్: జిన్నారం మండలం లోని నల్తూర్ గ్రామంలో సర్వే నెంబర్ 159 లో నూతనంగా రానున్న 200 కోట్ల ప్రాజెక్ట్ ఇండికేటర్ స్కూల్ ఈ ప్రాంతానికి రానీయకుండా అడ్డుపడుతున్న స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(Gudem Mahipal Reddy) పైన జిన్నారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. మా ప్రాంతం అంటే అంత చిన్న చూపుచూస్తున్నారు అని అన్నారు. గతంలో కూడా ఈ ప్రాంతానికి కోర్టు రానివ్వకుండా అడ్డుపడ్డారన్నారు. మేము జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ దృష్టికి తీసుకువేలి కోర్టు సాధించామన్నారు. అలాగే ఇప్పుడు కూడా అధికారులని మా మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి ఈ స్కూల్ ని మా ప్రాంతానికి సాధించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి, వడ్డే కృష్ణ, మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, వైస్ ఎంపీపీ మాజీ రమేష్, తదితరులు పాల్గొన్నారు.




