ఆర్ఆర్ ట్యాక్స్ అన్న మోదీ చర్యలు ఎందుకు తీసుకోరు?
03-06-2026 01:04 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలసినడుస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. పోక్సో కేసులో బండి భగీరథ్ ను 9 రోజులు ఎవరు కాపాడారు? అని కేటీఆర్ ప్రశ్నించారు. పొంగులేటి ఇంటిపై గతంలో ఈడీ దాడులు జరిగాయి. పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులపై ఇప్పటివరకూ చర్యలు లేవని విమర్శించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాపాడుతున్నదెవరు?, ఆర్ఆర్ ట్యాక్స్ అన్న మోదీ చర్యలు ఎందుకు తీసుకోరు? అని కేటీఆర్ ప్రశ్నించారు.






