9 May, 2026 | 5:35 AM

ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరైన కేటీఆర్

09-05-2026 12:52 AM

సిరిసిల్ల / ఎల్లారెడ్డిపేట,మే8,(విజయక్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా,ఎల్లారెడ్డిపేట మండల పరిధిలో మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ శుక్రవారం  పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.మొదటగా రాగట్లపల్లి గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దుమాల గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరై దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు కేటీఆర్కు ఘన స్వాగతం పలికారు.అలాగే నారాయణపూర్  రాగట్లపల్లి ఉమ్మడి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం నారాయణపూర్లో నిర్వహించిన ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో కూడా కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.