9 May, 2026 | 4:31 AM

మోదీ సభ విజయవంతానికి కాకతీయనగద్‌లో వాల్ రైటింగ్ ప్రచారం

09-05-2026 12:51 AM

మే 10న ప్రధాని పర్యటనకు భారీగా తరలిరావాలని పిలుపు

నేరేడ్మెట్, మే 8: దేశాన్ని వికసిత భారత దిశగా ముందుకు నడిపిస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి తెలంగాణ పర్యటనను విజయవంతం చేసేందుకు మల్కాజ్గిరి నియోజకవర్గంలోని కాకతీయనగర్ 187వ డివిజన్లో బీజేపీ నాయకులు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు.

బీజేపీ రాష్ట్ర నాయకురాలు శ్రీమతి జరిపిటి అంజలి దేవి ఆధ్వర్యంలో నిర్వహించిన వాల్ రైటింగ్ కార్యక్రమంలో కాలనీ వాసులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రధాని సభకు హాజరుకావాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ సందర్భంగా అంజలి దేవి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ దేశాల ముందుకు దూసుకెళ్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం సహకారం అందిస్తోందని పేర్కొన్నారు.

రూ.7,823 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగడం తెలంగాణకు గర్వకారణమన్నారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, జాతీయ రహదారుల అభివృద్ధి, రైల్వే విస్తరణ పనులు, పీఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర భవిష్యత్తును మార్చేలా ఉంటాయని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పరిశ్రమల స్థాపనతో తెలంగాణ ఆర్థికంగా మరింత బలపడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ప్రధాని సభ నేపథ్యంలో కాలనీలో బీజేపీ జెండాలు ఏర్పాటు చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గోడలపై అభివృద్ధి నినాదాలు రాస్తూ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే భారీ బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని అంజలి దేవి పిలుపునిచ్చారు. మోదీ నాయకత్వంలో తెలంగాణకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు వచ్చే అవకాశం ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల ఆశీస్సులతో దేశం మరింత పురోగతి సాధిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, మహిళా మోర్చా ప్రతినిధులు, యువ మోర్చా నాయకులు, కాలనీ పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు.