20 May, 2026 | 3:45 AM

కేఆర్‌ఎంబీ సమావేశం మరోమారు వాయిదా

20-05-2026 12:00 AM

హైదరాబాద్, మే 19(విజయక్రాంతి): నదీ జలాల వాటాలపై చర్చించేందుకు ఈ నెల 21న జరగాల్సిన కృష్ణా బోర్డు (కేఆర్‌ఎంబీ) 21వ సమావేశం మరోసారి వాయి దా పడింది. తొలుత ఏపీ కేబినెట్ భేటీ కారణంగా ఈ నెల 14 నుంచి 21కి మారిన ఈ సమావేశాన్ని, ఇప్పుడు కేబినెట్ భేటీ కారణంగా వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కోరిక మేరకు   కేఆర్‌ఎంబీ ఈ నిర్ణయం తీసుకుంది. సమావేశం తదుపరి తేదీని త్వరలోనే వెల్లడిస్తామని బోర్డు ఇరు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది.