సమాజానికి వెలుగు రేఖలు గురువులే
29-07-2026 02:11 PM
బోథ్,జూలై 29 (విజయక్రాంతి): సమాజానికి గురువు కాంతిరేఖ వంటి వాడని ఆయన సమాజ మార్పు కోసం ప్రయత్నిస్తే భవిష్యత్తుకు మంచి సమాజాన్ని నిర్మించి ఇస్తారని వేదం పాఠశాల ప్రధానోపాధ్యాయులు పచ్చిపాల సంతోష్ పేర్కొన్నారు. గురు పౌర్ణమి పురస్కరించుకొని వేదం పాఠశాలలో గురు పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పదవి విరమణ పొందిన గురువులను సన్మానించి జ్ఞాపక అందించారు.
విద్యార్థి దశ నుండి సమాజంలో నైతిక విలువలు ఉండే విధంగా విద్యార్థులను మార్చే సత్తా ఉపాధ్యాయుని కి ఉంటుందన్నారు. తల్లి తండ్రి గురువు దైవంతో సమానమని గురువు సమాజంలో గురుతర బాధ్యతను నిర్వహిస్తే దేశ భవిష్యత్తును మార్చవచ్చన్నారు కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






