9 June, 2026 | 5:45 PM

జనవాసల్లోని స్క్రాఫ్ దుకాణాలను ఎత్తి వేయాలి

09-06-2026 04:42 PM

స్క్రాప్ దుకాణాలను తనిఖి చేసిన చైర్పర్సన్ స్వాతి

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని పలు స్క్రాప్ దుకాణాలను బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి మాట్లాడుతూ.. నిబంధనలను గాలికి వదిలేసి, కనీస భద్రత ప్రమాణాలు పాటించకుండా జనావాసాల్లో  స్క్రాప్ దుకాణాలు ఏర్పాటు చేశారని ఆయా వార్డు ప్రజల ఫిర్యాదు మేరకు స్క్రాప్ దుకాణాలు తనిఖీ చేశామన్నారు.

జనావాసాల్లో ఏర్పాటు చేసిన స్క్రాప్ దుకాణాల వద్ద అపరిశుభ్రత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వెంటనే స్క్రాప్ దుకాణాలను వేరే చోటికి తరలించాలని దుకాణ యజమానులకు సూచించారు. లేని పక్షంలో శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. 

- కాలువ నిర్మాణ పనుల పరిశీలన

బెల్లంపల్లి పట్టణంలోని, బెల్లంపల్లి బస్తీ 19వ వార్డ్ లో మున్సిపాలిటీ గ్రాంట్ నిధులు రూ.5లక్షల నిధులతో నిర్మిస్తున్న నూతన కల్వర్టు నిర్మాణ పనులను బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ స్వాతి  పరిశీలించారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి రెడ్మాట్లాడుతూ బస్తీ ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలను దృష్టిలో పెట్టుకొని కల్వర్టు నిర్మాణ పనులను నాణ్యతతో, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు.