రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సిందే: కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ: లోక్‌సభలో 'పేపర్ లీక్' వ్యతిరేక బిల్లుపై(Anti Paper Leak Bill 2026) చర్చ జరుగుతుండగా, సంబంధం లేని అంశాలను ప్రస్తావించడం ద్వారా ప్రతిపక్షాలు ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు(Union Minister Kiren Rijiju) బుధవారం ఆరోపించారు. చర్చ సమయంలో ప్రతిపక్ష నాయకులు రాజకీయాలు చేయడంలో నిమగ్నమయ్యారని రిజిజు విమర్శించారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అధికార పక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పెల్లెట్ గన్ లతో కాల్పులు జరపాలని చెప్పింది అమిత్ షానేనా?, చర్చలో పాల్గొనేందుకు అమిత్ షా ఎందుకు రాలేదు? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. పోలీసుల తీరుపై అమిత్ షా క్షమాపణ చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలి.. లేకపోతే క్షమాపణ చెప్పాలని కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సరిపోతుందా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సిందేనని రిజిజు పట్టుబట్టారు. అధికార, విపక్ష సభ్యుల నినాదాల మధ్య లోక్ సభ వాయిదా పడింది.






