మత్స్యశాఖ సొసైటీ అధ్యక్షుడిగా కోట శ్రీనివాసరావు
కల్లూరు జూలై 31 (విజయక్రాంతి): మండల పరిధిలోని యర్రబోయినపల్లి గ్రామపంచాయతీ నందు మత్స్యకారుల సొసైటీ నూతన కమిటీని గ్రామ సర్పంచ్ పోట్రు శ్రీనివాసరావు, మత్స్యశాఖ అధికారి సీనియర్ ఇన్స్పెక్టర్ గుడివాడ విశ్వజిత్ సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది.
నూతన కమిటీ సొసైటీ అధ్యక్షుడిగా కోట శ్రీనివాసరావు,ఉపాధ్యక్షుడిగా ఇనపనూరి నరసింహారావు, కార్యదర్శిగా తాళ్ల నరసింహారావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అనంతరం మత్స్యకారుల సొసైటీ సభ్యుల అంగీకారంతో ఎన్నుకోబడిన నూతన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు.20 సంవత్సరాలుగా సొసైటీ కార్యవర్గ సభ్యులుగా ఉంటూ సొసైటీ కార్యవర్గాన్ని,సభ్యులను సమన్వయ పరుస్తూ పలు కీలక నిర్ణయాల్లో చేదోడు వాదోడుగా ఉండడంతో కోట శ్రీనివాసరావును అధ్యక్షుడిగా నియమించడం జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ సొసైటీ సభ్యుల సహకారంతో బాధ్యతాయుతమైన పదవిని తనకు అప్పగించినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలియజేశారు.
నాపై మీరుంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సొసైటీ అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. సభ్యుల సమిష్టి సహకారంతో పారదర్శకతగా వ్యవహరిస్తూ ముందుకెళతానని తెలిపారు. సొసైటీ అభివృద్ధికి అందరి సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటూ సరైన నిర్ణయాన్ని తీసుకుంటూ పని చేద్దామని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సింగిశాల ప్రసాద్, కోట రవీంద్రరావు, నల్లగట్ల వెంకటేశ్వరరావు, కోట రాములు, గొల్లమందల సుందర్రావు, నల్లగట్ల లక్ష్మయ్య, మల్లాది అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.






