17 March, 2026 | 8:21 PM

సత్తుపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూకలకుంట రవి

17-03-2026 06:37 PM

సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది కూకలకుంట రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా సాధు కృష్ణయ్య, జాయింట్ సెక్రటరీగా వంకదారు రామకృష్ణ, కోశాధికారిగా కొప్పుల కేశవరెడ్డి, లైబ్రరీ సెక్రటరీగా నల్లగట్ల విజయకుమార్,  స్పోర్ట్స్ గేమ్స్ జేవీ.నరేంద్ర, మహిళా ప్రతినిధిగా ఎస్కే.జీనత్ హస్సీనా, ఈసీ మెంబర్లుగా గుంట్రు శ్రీనివాసరావు, మోదుగు నరేష్ లను ఎన్నుకున్నారు.

ఈనెల 26న బార్ అసోసియేషన్‌ ఎన్నికలు జరపమని తెలంగాణ బార్ అసోసియేషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. సత్తుపల్లిలో ఈనెల 9 నుంచి 11 వరకు నామినేషన్ ప్రక్రియ సాగగా 16న నామినేషన్లు ఉపసంహరణ కావడంతో నూతన కార్యవర్గం ఏకగ్రీవమైంది. ఎన్నికల అధికారిగా ఎస్ లక్ష్మణరావు వ్యవహరించారు. కాగా ఉపాధ్యక్షుడి ఎన్నిక ఈనెల 26న జరుగనుంది. ఏప్రిల్ 1నుంచి ఏడాది వరకు ఈ నూతన కార్యవర్గం కొనసాగనుంది.