17 March, 2026 | 9:45 PM

డైరెక్టర్ జనరల్ టీజీ ఎస్పీఎఫ్ స్వాతి లక్రా ఆదేశానుసారం

17-03-2026 06:33 PM

తెలంగాణ స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో 41 డివిజన్లో శ్రమదానం

ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక-2026 స్వచ్ఛ తెలంగాణ

పాల్వంచ,(విజయక్రాంతి): పాల్వంచ 41 డివిజన్లో టీజీ ఎస్పీఎఫ్ ఆధ్వర్యంలో రాతి చెరువు లోని ముల్లకంప, ప్లాస్టిక్ కవర్లు,  చెత్త చెదారం,  పారిశుద్ధ పనులను స్వయంగా మేయర్, డిప్యూటీ మేయర్, అధికారులు, కేటీపీఎస్ సిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బంది, మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ గణేష్, డిప్యూటీ మేయర్, సిరిపురపు లలిత కుమారి, 41వ డివిజన్ కార్పొరేటర్  అన్నపూర్ణ,  అడిషనల్ కమాండెంట్ టీజీ ఎస్పీఎఫ్ పి కోటేశ్వరరావు,  అసిస్టెంట్ కమాండెంట్ ఎస్పీఎఫ్ యస్ చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్ డీ కిరణ్ , ఎస్పీఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.