23 March, 2026 | 3:02 PM

Breaking News

పదవ తరగతి పరీక్షా కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్   •   అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్   •   పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ   •   మంథని బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా బాలోజీ   •   జగన్నాద్ పూర్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించారు   •   మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు సీఎం శుభవార్త   •   అణచివేత ధోరణి వీడి ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలి   •   ఓబీసీ చైర్మన్‌గా షాద్‌నగర్ ఎమ్మెల్యే బాధ్యతలు.. పాల్గొన్న మంత్రి పొన్నం   •   పశ్చిమాసియాలో యుద్ధం.. లోక్‌సభలో మోదీ ఆందోళన   •   అసెంబ్లీ ముట్టడి అడ్డుకట్ట – బీజేపీ నాయకుల అరెస్టుపై ఆగ్రహం   •  

అక్రమ నిర్మాణాల అడ్డా కొంపల్లి సర్కిల్

23-03-2026 12:00 AM
  1. జయభేరిలో జోరుగా సాగుతున్న అక్రమ షెడ్డు నిర్మాణం
  2. యథేచ్ఛగా కొనసాగుతున్న భారీ షెడ్ల నిర్మాణాలు
  3. ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకొని టౌన్ ప్లానింగ్
  4. అధికారుల వ్యవహార శైలి పై అనేక అనుమానాలు
  5. ప్రమాదాలు పొంచి ఉన్న అక్రమ నిర్మాణాలు ఆపాలి
  6. సర్కిల్ అధికారులను కోరుతున్న స్థానిక ప్రజలు

కుత్బుల్లాపూర్, మార్చి 22(విజయక్రాంతి): మున్సిపల్ చట్టాలు కాగితాలకే పరి మితం అన్నట్లుగా కొంపల్లి సర్కిల్ అధికారుల పనితీరు అద్దం పడుతోందని స్థానికు లు ఆరోపిస్తున్నారు. సామాన్యుల పాలిట ఉక్కుపాదంతో కూల్చివేతలు చేపట్టే అధికారులు పేరు పలుకుబడి రాజకీయ అండదండలు ఉన్న వారి పట్ల భిన్నంగా సహకరించడం చర్చనీయాంశంగా మారింది. కొంపల్లి సర్కిల్ పరిధిలోని జయభేరిలో కొనసాగుతున్న అక్రమ షెడ్డు నిర్మాణం అధికారుల ద్వంద్వ వైఖరికి నిదర్శనమని స్థానికంగా విమర్శలు వెలువడుతున్నాయి. 

జయభేరిలో జోరుగా అక్రమ షెడ్డు నిర్మాణం

మున్సిపల్ చట్టాలను తుంగలో తొక్కి అనుమతులకు విరుద్ధంగా  కొంపల్లి సర్కిల్ జయభేరిలో జోరుగా అక్రమ షెడ్డు నిర్మా ణం కొనసాగుతోంది. కనీసం నియమాలు పాటించకుండా సెట్ బ్యాక్ ఫైర్ సేఫ్టీ లేకుం డా భారీ షెడ్డు నిర్మాణం కొనసాగుతుంటే కనీసం స్పందించకుండా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై స్థానికులు మండిపడుతు న్నారు.

ప్రమాదాలకు నిలయంగా నిర్మిస్తున్న నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని స్థానికులు పలుమార్లు ఫిర్యాదులు చేసినా కూడా మాకు సంబంధమే లేదన్నట్లుగా టౌన్ ప్లానింగ్ సర్కిల్ యంత్రాంగం వ్యవహరిస్తున్న  తీరుపై అనేక అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. అవినీతికి దాసోహం అం టూ అధికారులు పరోక్షంగా అక్రమ నిర్మాణదారులకు అండగా నిలుస్తున్నారనే అప వాదులు వెలువడుతున్నాయి.

కాసుల కక్కుర్తిలో పడి అక్రమ నిర్మాణాలను నివారించా ల్సిన అధికారులే  చట్టాలను కాగితాలకే పరిమితం చేస్తున్నారని విమర్శలు బహిరంగం గా వెలువడుతున్నాయి. సామాన్యులకు ఓ న్యాయం.. అక్రమార్కులకు మరో న్యాయ మా అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

నోటీసులు ఇస్తారు.. చర్యలు తీసుకోరు

కొంపల్లి సర్కిల్లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఏసీపీకి ఫిర్యాదు చేసినప్పటికి నోటీసుల పేరుతో కాలయాపన చేస్తున్నారు. కొంపల్లి సర్కిల్ పరిధిలోని జయభేరిలో జోరుగా అక్రమ నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నా టౌన్ ప్లానింగ్ ఏసీపీ పట్టించుకో కపోవడం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  పలుమార్లు ఫిర్యాదు చేసినా డోంట్ కేర్ అన్నట్టు అధికారుల వ్యవహారాల శైలీ ఉంటుందని ఆరోపణలు  బలంగా వినిపిస్తున్నాయి.

అక్రమార్కులకు అధికారులు వత్తాసు పలుకుతున్నారని, అందుకే అక్రమ నిర్మాణాలు దర్జాగా సాగిస్తున్నారని ఇది అధికారులకు సిగ్గు చేటు అంటూ స్థానికులు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా జోనల్ కమిషనర్ స్పందించి కొంపల్లి సర్కిల్ పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్  చేస్తున్నారు.