12 July, 2026 | 5:50 PM

Breaking News

కన్నెపెళ్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేయాలి   •   ఎమ్మార్పీఎస్ కరపత్రాలు ఆవిష్కరణ   •   సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం   •   పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నూతన ఎస్సీ సెల్ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే పాయం   •   సర్పంచుల శిక్షణకు ఎంపికైన పాట్నాపూర్ సర్పంచ్   •   జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు ధర్మపురి క్రీడాకారుడు ఎంపిక   •   వర్షాలు సమృద్ధిగా కురవాలని జెట్టక్కను తరిమికొట్టిన గ్రామస్తులు   •  

మాటకు కట్టుబడి మౌలిక వసతులు

23-03-2026 12:00 AM
  1. సొంత నిధులతో సీసీ రోడ్డు వేస్తున్న 

దామరగిద్ద మాజీ సర్పంచ్ మధుసూదన్ గుప్త

చేవెళ్ల మార్చి 22(విజయక్రాంతి): వార్డు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేస్తానని మున్సిపల్ ఎన్నికల్లో 9వ వార్డులో వార్డు ప్రజలకు ఇచ్చిన మాట మాజీ సర్పంచ్ మధుసూదన్ గుప్తా నిలబెట్టుకుంటున్నారు. ఆదివారం సర్పంచుల సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు, దామరగిద్ద మాజీ సర్పంచ్ రెడ్డిశెట్టి మధుసూదన్ గుప్త సొంత డబ్బులతో రామాలయం వద్ధ సీసీ రోడ్డు పనులను మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమతావెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ కాసుల రాముగౌడ్, కౌన్సిలర్లు చేవెళ్ళ మాజీ సర్పంచ్ బండారి శైలజాఆగిరెడ్డి, తాళ్లపల్లి నర్సింలు,

మంగలి కల్యాణియాదగిరి, మద్దెల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మలిపెద్ది వెంకటేశం గుప్తలతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని స్పష్టం చేశారు. వార్డు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయమని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమతావెంకట్ రెడ్డి సహకారంతో ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్యగౌడ్, వైస్ చైర్మన్ బ్యాగరి రాములు, వార్డు ప్రజలు తదితరులు ఉన్నారు.