గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అజార్
- అభ్యర్థిత్వాలను ఆమోదించిన గవర్నర్ శుక్లా
- ప్రభుత్వానికి భారీ ఊరట
- ఏ సభలోనూ సభ్యుడు కాకుండానే మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్
హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ఇద్దరు ఎమ్మెల్సీల నియామకా నికి లైన్ క్లియర్ అయింది. మంత్రి అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండామ్ అభ్యర్థిత్వాలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా శనివా రం ఆమోదం తెలిపారు. వీరిద్దరిని ఎమ్మెల్సీగా తీర్మానంచేస్తూ రాష్ట్ర క్యాబినెట్ గతేడాది ఆగస్టు 30న గవర్నర్‌కు పంపించింది. అప్పటినుంచి గవర్నర్ ఈ ఫైల్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఇప్పుడు గవర్నర్ కోటాలో అజారుద్దీన్, కోదండరామ్‌కు ఎమ్మెల్సీలుగా ఆమోదం లభించడంతో ప్రభుత్వ వర్గాలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. అజారుద్దీన్ ఏ సభలోనూ సభ్యుడు కాకుండానే క్యాబినెట్‌లో స్థానం దక్కించుకున్నారు. ఆరు నెలల క్రితం, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మంత్రిగా ప్రమాణంచేశారు.
అప్పటినుంచి ఆరు నెలల్లోపు అసెంబ్లీ లేదా శాసన మండలికి సభ్యుడిగా ఎన్నిక కా వాల్సి ఉంటుంది. ఈ నెల 30తో గడువుగు ముగియనున్నది. ఈ విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ప్రభుత్వాన్ని ఆందోళన కలిగించింది. ఈ క్రమం లో ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వ యంగా లోక్‌భవన్‌లో గవర్నర్‌తో సమావేశమై ఎమ్మెల్సీల నియామకంపై త్వరగా నిర్ణ యం తీసుకోవాలని కోరారు.
ఈ నేపథ్యంలో గవర్నర్.. ఎమ్మెల్సీల ఫైల్‌పై సంత కంచేయగా, ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ త్వరలో వెలువడనున్నది. మ ంత్రి అజారుద్దీన్‌కు మంత్రి పదవి అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఈ పరిణామం ఇటు అజారుద్దీన్‌తోపాటు అటు రేవంత్‌రెడ్డికి, ప్రభుత్వానికి భారీ ఊరటను ఇచ్చింది.
గవర్నర్ నిర్ణయం హర్షనీయం: పీసీసీ చీఫ్
ఎమ్మెల్సీలుగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్, తెలంగాణ ఉద్యమ సిద్ధాంత కర్త ప్రొఫె సర్ కోదండరామ్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమర్‌గౌడ్ శనివారం ఒక ప్రకటనలో హర్షం వ్య క్తం చేశారు. ప్రజా జీవితం, క్రీడారంగం, సా మజిక ఉద్యమాల్లో విశిష్ట సేవలు అందించిన అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీగా అవకాశం రావడం సముచిత నిర్ణయమన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కోదం డరామ్ పోషించిన పాత్ర చారిత్మాత్మకమని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో వివిధ రంగాల్లో అనుభవం ఉన్న వ్యక్తులు శాసనసభ, శాసనమండలిలో ఉండటం ద్వారా పాలన మరింత సమర్థవంతంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.






