11 July, 2026 | 11:02 PM

మంచిర్యాల నియోజక వర్గాన్ని ముందంజలో ఉంచాలి

11-07-2026 09:41 PM

- ఎంఎల్ఎ ప్రేమ్ సాగర్ రావు

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న SIR ప్రక్రియ కార్యక్రమం విజయవంతానికి అందరు కృషి చేయాలని, రాష్ట్రంలోనే మంచిర్యాల నియోజక వర్గంను మొదటి స్థానంలో ఉంచాలని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కోరారు. శనివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డులో గల మినీ పద్మనాయక ఫంక్షన్ హాల్ లో SIR ప్రక్రియ పైన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేటర్లు, ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి మాట్లాడారు.

ఈ నెల 24 లోపు అందరు కలిసికట్టుగా  పని చేయాలని, సర్ ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, పిసిసి సభ్యులు కొండ శేఖర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గజ్జల హేమలత, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు, మహిళా నాయకురాళ్ళు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.