డ్రోన్ల వినియోగంపై నిషేధాజ్ఞ్ఞలు
పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం
కరీంనగర్ క్రైం, జూన్ 2 (విజయ క్రాంతి): కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో భద్రత కారణాల దృష్ట్యా పారాగ్లైడర్స్, రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఏయిర్ క్రాఫ్ట్ ల వినియోగాన్ని నిషేదించడం జరిగిందని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిషేదాజ్ఞలు ఈనెల 30 వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. పైన పేర్కొన్న సాంకేతిక పరికరాలను ఈ మధ్యకాలంలో వివాహాది శుభకార్యాలు, వివిధ కార్యక్రమాల సందర్భంగా వినియోగించబడుతు న్నాయని తెలిపారు.
ఉగ్రవాదులు, అసాంఘికశక్తులు వీటిని వినియోగించే అవకాశా లుండటంతో సదరు సాంకేతిక పరికరాల వినియోగాన్ని నిషేదించడం జరిగిందని తెలిపారు. ఎవరైనా వినియోగించదలచిన ట్లయి తే సంబంధిత పోలీసుల అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లం ఘించిన వారిపై ఐపిసి సెక్షన్ 188 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.






