ప్రాంతీయతను ప్రతిబింబించే పళ్లబురుసు
‘బలగం’ ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తండ్రీకొడుకులుగా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త సినిమా ‘పళ్లబురుసు’. తెలుగు సంస్కృతి, ప్రాంతీయతను ప్రతిబింబించే ఈ చిత్రం వినోదభరితమైన కామెడీ -డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వినూత్న చిత్రానికి ఉదయ్ చౌహాన్ కథ, దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణాని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో ప్రజ్వల్, గోమతిరెడ్డి, కిరణ్ మాచా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ సినిమాను ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ గమ్మత్తుగా ఉంది. ఈ పోస్టర్‌లో జిల్లా కోర్టు ఆవరణలో పెద్ద టూత్‌బ్రష్‌ను త్రాసులా రూపొందించి, దానిపై వెన్ను వెన్నుకు ఆనుకుని కూర్చున్న ఇద్దరు ప్రధాన పాత్రధారులను చూపించారు. ఈ వినూత్న విజువల్ సినిమా కథపై ఆసక్తిని రేకెత్తిస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ చిత్రానికి వినోద్ కే బంగారి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, పవన్ సీహెచ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. క్షితిజ్ జీవన్ రంధీర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఈ సినిమా నుంచి త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్‌ను విడుదల చేయనున్నారు మేకర్స్.






