2 September, 2026 | 10:25 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

రూ. 1.72 కోట్లతో కేజీబీవీ పాఠశాల మరమ్మతులు

15-05-2026 | 01:35am

లక్ష్యంతో చదవండి.. ఉన్నదులుగా ఎదగండి : ఎమ్మెల్యే

బోథ్. మే 14( విజయక్రాంతి): విద్యార్థు లు లక్ష్యంతో చదివి ఉన్నతులుగా ఎదగాలని ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పేర్కొన్నారు. గురువారం నేరగొండ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో అభివృద్ధి పనుల కోసం ఒక కోటి 72 లక్షల రూపాయల పనులకు భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల వసతులు కల్పించడం జరిగిందన్నారు.అయితే విద్యార్థులు లక్ష్యంతో చదివి ఉన్నతులుగా ఎదగాలని కోరారు. ఈ సందర్భంగా పాఠశాలలో నివాసతులను పరిశీలించడంతోపాటు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సంపాదించిన విద్యార్థులను ఈ సందర్భంగా సన్మానించారు. మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తే భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.