2 September, 2026 | 11:25 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

పామ్ ఆయిల్ సాగుపై అవగాహన

15-05-2026 | 01:34am

మహబూబాబాద్, మే 14 (విజయక్రాంతి): ఆయిల్ పామ్ పంట సాగుపై ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన ప్రచార కార్యక్రమాలు, అవగాహన సదస్సు లు నిర్వహిస్తున్నారు.ఆయిల్ పామ్, ఉద్యాన పంటల సాగు లాభదాయకంపంట మార్పిడితో అధిక ఆదాయం పొందవచ్చని రైతులకు వివరిస్తున్నారు.

ఆయిల్ పామ్, ఉద్యాన, కూరగాయలు, పండ్లు, పూలు, మల్బరీ మొదలైన  మార్కెట్ డిమాండ్ ఉన్న పంటల సాగు, పుట్టగొడుగులు, తేనెటీగల పెంపకం జిల్లా నుండి ఆయిల్ పామ్ ఆత్మీయ సమ్మేళనానికి, ఆయిల్ పామ్ విజ్ఞాన యాత్రకు జిల్లాకు చెందిన రైతులు హాజరయ్యారు.

గురువారం నాడు అశ్వారావుపేట ఆయిల్ పామ్ శుద్ధి ఫ్యాక్టరీ ఆవరణలో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన రైతులు ఆయిల్ పామ్ సాగులో అశ్వారావుపేట రైతుల అనుభవాలు, ఆధునిక పద్ధతులు, లేత తోటల్లో అంతర పంటల సాగు, ముదురు తోటలలో కోకో, వక్క, జాజికాయ, మిరియాలు వంటి విలువైన అంతర పంటల సాగు గురించి వివరంగా తెలుసుకున్నారు.

ఈ విజ్ఞాన సందర్శనకు తెలంగాణ ఆయిల్ ఫెడ్ సంస్థ ఆర్ధిక సహాయం అందించారు. ఈ ప్రోగ్రామ్ కు జిల్లా నుండి ఆయిల్ ఫెడ్ అధికార్లు, ఉద్యాన శాఖ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.