17 April, 2026 | 3:46 AM

లోక్‌సభలో ౩ కీలక బిల్లులు

17-04-2026 01:22 AM
  1. బిల్లుల ద్వారా మహిళలకు చట్టసభల్లో 33 శాతం
  2. రిజర్వేషన్ల కల్పన.. నియోజకవర్గాల పునర్విభజన 
  3. బిల్లుల అనుమతికి స్పీకర్ ఓటింగ్ 
  4. సభకు 436 మంది హాజరు.. వారిలో 251 మంది అనుకూలం 
  5.   185 మంది వ్యతిరేకం.. బిల్లులకు మెజార్టీ లభించడంతో స్పీకర్ అనుమతి
  6. బిల్లులపై నేడు ఓటింగ్

న్యూఢిల్లీ, ఏప్రిల్ ౧౬: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్‌సభలో మూడు కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టింది. వాటిలో ఒకటి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 2026, రెండోది నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లు 2026, మూడోది కేంద్రపాలిత ప్రాం తాల చట్ట సవరణ బిల్లు. మొదటి రెండు బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ బిల్లులను ప్రవేశపెట్టగా, మూడో బిల్లును హోం మంత్రి అమిత్ షా సభకు ప్రవేశపెట్టారు.

131వ రాజ్యాంగ సవరణ బిల్లును విపక్షాలన్నీ వ్యతిరేకించడంతో స్పీకర్ ఓం బిర్లా మొత్తం మూడు కీలక బిల్లులపై చర్చకు అనుమతించేందుకు ఓటింగ్ నిర్వహించారు. సభలో మొత్తం ౪౩౬ మంది సభ్యులు ఉండ గా, రాజ్యాంగ సవరణ బిల్లుకు అనుకూలంగా 251 మంది సభ్యులు ఓటు వేశారు. వ్యతిరేకంగా 1౮౫ మంది ఓటు వేశారు.

బిల్లులపై చర్చకు మెజార్టీ సభ్యులు అనూకలంగా ఓటు వేయడంతో చర్చకు అంగీకరించినట్లయిందని స్పీకర్ ప్రకటించారు. బిల్లులపై శుక్రవారం ఓటింగ్ నిర్వహిస్తామని స్పీకర్ ప్రకటించారు. బిల్లులు ఆమోదం పొందాలంటే ఓటింగ్‌లో కేంద్ర ప్రభుత్వానికి 360 సభ్యుల మద్దతు అవసరం. ఓటింగ్‌లో ఆ బిల్లులకు ఆమోదం లభిస్తుందా.. లేదా.. అనే విషయంపై ఇప్పుడు యావత్ దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

మూడు బిల్లుల ద్వారా..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుల్లో మొదటిది రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం బిల్లు ప్రధాన ఉద్దేశం. రెండో బిల్లు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు. పెరిగిన జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాల పునర్విభజించడం బిల్లు లక్ష్యం. మూడోది కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు. దీని ద్వారా ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కశ్మీర్ వంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో మహిళా రిజర్వేషన్లను అమలు చేసేందుకు వీలవుతుంది. మొత్తానికి ఈ మూడు బిల్లులు పరస్పర సంబంధం కలిగి ఉన్నాయి. మహిళా కోటా సమర్థంగా అమలయ్యేందుకు మిగతా రెండు బిల్లులూ తోడ్పడతాయి.

కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలివి..

డీలిమిటేషన్ బిల్లు ద్వారా లోక్‌సభ సీట్ల సంఖ్య 543 నుంచి ఏకంగా 850కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. వీటిలో రాష్ట్రాల పరిధిలో 815 సీట్లు కాగా, 35 కేంద్రపాలిత ప్రాంతాల సీట్లు. 2011 జనాభా లెక్కల ఆధారంగా బిల్లులకు ఆమోదం పొంది, 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనేది బిల్లుల లక్ష్యం. ప్రస్తుతం లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యం కేవలం 14 శాతంగా మాత్రమే ఉందని, మహి ళా బిల్లు ఆమోదం పొందితే వారి ప్రాతినిథ్యం మరింత పెరుగుతుందని తెలిపింది.

నేపాల్, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాల్లో ఇప్పటికే మహిళా కోటా అమలులో ఉందని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌లోనూ మహిళా కోటా అమలు కావాలని, అమలులో విషయంలో ఇప్పటికే ఆలస్యమైందని నొక్కి చెబుతోంది. మహిళా రిజర్వేషన్లను అమలు చేసేందుకు నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరని కేంద్రం వాదిస్తున్నది.

అయితే, ఈ బిల్లులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మహిళా రిజర్వేషన్లకు తాము సూత్రప్రాయంగా మద్దతు ఇస్తున్నామని, అయితే.. డీలిమిటేషన్‌తో మహిళా కోటాను ముడిపెట్టడం సరికాదని తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెరిగి, జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుందని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని వాదిస్తున్నాయి. జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ శుద్ధ తప్పు అంటూ వ్యతిరేకిస్తున్నాయి.

ఏపీలో 38, తెలంగాణలో 26 స్థానాలు: అమిత్ షా

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ వేదికగా ఉద్ఘాటించారు. ప్రక్రియ అమలులోకి వచ్చిన తర్వాత ఏపీలో లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి, తెలంగాణలో 17 స్థానాల నుంచి 26కు పెరుగుతాయని స్పష్టం చేశారు. అలాగే, కర్ణాటకలో 28 నుంచి 42కు, తమిళనాడులో 39 నుంచి 59కి, కేరళలో 20 నుంచి 30కి సీట్లు పెరుగుతాయని వివరించారు. దక్షిణాది జనాభా శాతం కంటే, ఎక్కువ సీట్లు పెరుగుతాయని పేర్కొన్నారు.

విపక్షాలు అవాస్తవాలు చెబుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని విమర్శించారు. బిల్లుతో దక్షిణాదిలో లోక్‌సభ స్థానాలు 129 నుంచి 195కు పెరుగుతాయని స్పష్టం చేశారు. బిల్లుతో లాభం తప్ప నష్టం జరగదని హామీ ఇచ్చారు. బిల్లుపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు ఎంతో లాభమని అభిప్రాయపడ్డారు. కర్ణాటక, తెలంగాణ బాగా ఎక్కువగా లాభప డతాయని వివరించారు. 

చాణక్యుడు కూడా ఖంగు తినేవాడు!: ప్రియాంకా గాంధీ

మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో కాంగ్రెస్ సభ్యురాలు ప్రియాంకా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశా రు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు. చాణక్యుడు ఇప్పుడు బతికి ఉంటే ఖంగుతినేవాడని, బీజేపీ చాకచక్యాన్ని చూసి చాణక్యుడు కూడా నివ్వెర పోయేవాడని చమత్కరించారు. మహిళల హక్కుల కోసం తామొక్కరే పోరాడుతున్న ట్లు ప్రధాని మోదీ చెప్తున్నారని, అది పచ్చి అబద్ధమని పేర్కొన్నారు.

రాజ్యాంగానికి నష్టం కలిగిస్తూ బీజేపీ తన పునాదులను బలోపేతం చేసుకుంటున్నదని మండిపడ్డా రు. అబద్ధాలు చెప్పే వారిని మహిళలు సులభంగా గుర్తిస్తారని హెచ్చరించారు. మహిళా రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ఎప్పుడూ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. కేంద్రం మహిళాలకు ౩౩ కోటా ఇవ్వాలనుకుంటే ప్రస్తుత ౫౪౩ లోక్‌సభ సీట్ల నుంచి ఎందుకు ఇవ్వలేకపోయిందని నిలదీశారు. మహిళలకు సమాన హక్కుల కోసం 1928లోనే తన తాతా మోతీలాల్ నెహ్రూ బిట్రిష్ పాలకులకు ఒక నివేదిక ఇచ్చారని గుర్తుచేశారు.

సర్దార్ పటేల్ నేతృత్వంలో జరిగిన కరాచీ సదస్సులో దీనిపై తీర్మానం కూడా చేశారని వివరించారు. మున్సిపాలిటీలు, పంచాయతీల్లో మహిళా రిజర్వేషన్లను తన తండ్రి రాజీవ్‌గాంధీ ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. కేవలం ఎన్నికల లాభం కోసమే కేంద్రం ఇప్పుడీ బిల్లులను తెరపైకి తెచ్చిందని విమర్శించారు. ‘రాజీవ్ గాంధీ హయాంలో కాం గ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి పంచాయతీ ల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చింది.

మహిళలకు ప్రాతినిధ్యమనేది కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు ఆమోదం పొందితే దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయినట్లే. జన గణన, కుల గణన చేపట్టకుండా, మహిళా కోటా బిల్లు ద్వారా ఎలా ఓబీసీ మహిళలకు న్యాయం జరుగుతుంది. ౨011 జనాభా గణనను ప్రాతిపదికగా బిల్లులు రూపొందించ డం కచ్చితంగా ఓబీసీలకు అన్యాయం చేయడమే’ అంటూ వ్యాఖ్యానించారు.