calender_icon.png 18 February, 2026 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేరళ స్టోరీ సీక్వెల్ సిద్ధం

18-02-2026 12:00:00 AM

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన చిత్రం ‘ది కేరళ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్‌గా వస్తోంది. ‘ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో ఉల్కా గుప్తా, అదితీ భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కామాఖ్య నారా యణ్ సింగ్ దర్శకత్వంలో సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై విపుల్ అమృత్ లాల్ షా, ఆశిన్ ఎ షా నిర్మిస్తున్నారు.

ఫిబ్రవరి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ మంగళవారం విడుదల చేశారు. ‘వాళ్లు మన కూతుళ్లను టార్గెట్ చేశారు. నమ్మకాన్ని వమ్ము చేశారు. భవిష్యత్తును నాశనం చేశారు. ఈసారి మనం మౌనంగా ఉండకూడదు.. సహించేది లేదు.. పోరాడుదాం’ అంటూ మేకర్స్ ఈ ట్రైలర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

తొలిభాగం కంటే  ఈ చిత్రం మరింత తీవ్రంగా, భయానకంగా ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. రాబోయే 25 ఏళ్లలో భారతదేశం మొత్తం షరియా చట్టంతో పాలించే ఇస్లామిక్ స్టేట్‌గా మారుతుందనే హెచ్చరికతో ట్రైలర్ ప్రారంభమైంది. ఆ తర్వాత కథ మూడు వేర్వేరు రాష్ట్రాల్లోని ఒక మతానికి చెందిన ముగ్గురు యువతుల జీవితాల చుట్టూ తిరుగుతుంది.