18-02-2026 12:00:00 AM
లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జంటగా నటించిన చిత్రం ‘సతీ లీలావతి’. తాతినేని సత్య దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్లపై నాగ మోహన్ నిర్మించారు. ఇందులో నరేశ్, వీటీవీ గణేశ్, మొట్టా రాజేంద్రన్, జాఫర్ సాదిక్, జోషి ముఖ్యపాత్రలు పోషించారు.
ఈ సినిమా మార్చి 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ‘మధురం’ పాటను రిలీజ్ చేశారు. ‘కళ్లూ రెండు కలిశాకా.. ఉన్నట్టుండీ మనసంతా.. తుళ్లీ తుళ్లీ పడుతోందా.. నిన్నే నువ్వే మరి చేంతా..’ అంటూ సాగు తోందీ పాట. మిక్కీ జే మేయర్ స్వరపరిచిన ఈ గీతాన్ని కార్తిక్ ఆలపించారు.