12 April, 2026 | 3:44 AM

20న కేసీఆర్ బహిరంగ సభ

12-04-2026 12:10 AM
  1. జగిత్యాలలో ఏర్పాట్లు పరిశీలించిన జీవన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు
  2. లక్షమంది సమీకరణే లక్ష్యం

జగిత్యాల, ఏప్రిల్ 11(విజయక్రాంతి):బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ నెల 20న సాయంత్రం 5 గంటలకు జగిత్యాలలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని మోతే రోడ్డులో ఈ సభ జరగనుండగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు.ఈ సభ ఏర్పాట్లలో భాగంగా జీవన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్ నేతలతో కలిసి జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్‌కేఎన్‌ఆర్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్, మోతే రోడ్, ఇతర కాలేజీ ప్రాంగణాలను నాయకులు పరిశీలించారు.

ఈ కార్యక్ర మంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే కె.సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, లోక బాపు రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ, ఈ నెల 20న మోతే రోడ్డు లో జరిగే కేసీఆర్ సభకు భారీగా జనసమీకరణ జరుగుతుందని తెలిపారు. సు మారు లక్షమంది హాజరు కావాలని లక్ష్యం గా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు కేసీఆర్ సభకు రావడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.