calender_icon.png 5 February, 2026 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల్లో ‘త్రిముఖ’ పోరు

05-02-2026 12:00:00 AM

మహబూబాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈసారి 12 మున్సిపాలిటీలో జరగనున్న ఎన్నికల్లో త్రిముఖ పోరు అనివార్యంగా మారింది. గత మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు అన్ని కౌన్సిలర్ పదవులకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను నిలపగా, పలుచోట్ల బీజేపీ, వామపక్ష, ఇతర పార్టీలు అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపాయి. అయితే ఈసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జరిగే 12 మున్సిపాలిటీల్లోని 260 వార్డు కౌన్సిలర్ పదవులకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ తో పాటు బీజేపీ పార్టీలు అభ్యర్థులను పోటీకి పెట్టాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 1,072 మంది అభ్య ర్థులు వార్డు కౌన్సిలర్ పదవులకు పోటీ చే స్తుండగా కాంగ్రెస్ నుండి 249, బీఆర్‌ఎస్ నుండి 259, బీజేపీ నుంచి 238 మంది అ భ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇందు లో మహబూబాబాద్ మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా కాంగ్రెస్ 32, బీఆర్‌ఎస్ 35, బీజేపీ 30 సీట్లలో పోటీకి అభ్యర్థులను నిలిపాయి.

అలాగే కేసముద్రం మున్సిపాలిటీలో 16 వార్డులకు కాంగ్రెస్ 16, బీఆర్‌ఎస్ 16, బీజేపీ 16, డోర్నకల్ లో 15 వార్డులకు కాంగ్రెస్ 15, బీఆర్‌ఎస్ 15, బీజేపీ 15, మరిపెడలో 15 వార్డులకు కాంగ్రెస్ 15, బీఆర్‌ఎస్ 15, బీజేపీ 15, తొర్రూరు లో 16 వా ర్డులకు కాంగ్రెస్ 16, బీఆర్‌ఎస్ 16, బీజేపీ 16, ములుగు లో 20 వార్డులకు కాంగ్రెస్ 20, బీఆర్‌ఎస్ 20, బీజేపీ 20, భూ పాలపల్లి లో 30 వార్డులకు కాంగ్రెస్ 30, బీఆర్‌ఎస్ 30, బీజేపీ 25, వర్ధన్నపేటలో 12 వార్డులకు కాంగ్రెస్ 12, బీఆర్‌ఎస్ 12, బీజేపీ 12, నర్సంపేటలో 30 వార్డులకు కాంగ్రెస్ 30, బీఆర్‌ఎస్ 30, బీజేపీ 30, పరకాలలో 22 వార్డులకు కాంగ్రెస్ 22, బీఆర్‌ఎస్ 22, బీజేపీ 21, జనగామలో 30 వార్డులకు కాం గ్రెస్ 27, బీఆర్‌ఎస్ 29, బీజేపీ 27, స్టేషన్ ఘనాపూర్ లో 18 వార్డులకు కాంగ్రెస్ 18, బీఆర్‌ఎస్ 18, బీజేపీ 13 వార్డులకు కౌన్సిలర్ అభ్యర్థులను పోటీలో నిలిపాయి. దీనితో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీల్లో జరిగే వార్డు కౌన్సిలర్ ఎన్నికల్లో ‘త్రిముఖ’ పోరు అనివార్యంగా మారింది. 

త్రిముఖ పోరు ఎవరికి లాభం?

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ గుర్తులతో తొలిసారి జరుగుతున్న ఎన్నికల్లో ఈసారి మునుపెన్నడూ లేని విధంగా ‘త్రిముఖ’ పోరు జరుగుతుండడంతో ఎవరికి లాభం చేకూరుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ హోరా హోరి తలపడే పరిస్థితి ఉండగా, మధ్యలో బీజేపీ కూడా తాము కూడా ఏం తక్కువ తీసిపోలేదంటూ ఈసారి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 మున్సిపాలిటీల్లో కొన్ని చోట్ల మినహా దాదాపు మెజారిటీ స్థానాల్లో తన అభ్యర్థులను పోటీకి నిలిపి మున్సిపల్ పోరుకు కాలు దువ్వుతుండడంతో ఓట్లు చీలి ఎవరికి లాభం చేకూరు తుందనే చర్చ సాగుతోంది. వార్డు కౌన్సిల్ పదవులకు భారీ మెజార్టీ దక్కే అవకాశాలు అన్నిచోట్ల ఉండవని, స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించే అవకాశాలే అధికంగా ఉంటాయని, బీజేపీ అభ్యర్థులు ఓట్లు చీల్చే పరిస్థితి ఏర్పడితే ఎవరికి లాభం కలుగుతుందనే అంశం ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారింది.

రెబల్స్ బెడద

ఇదిలా ఉండగా మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి వివిధ పార్టీల నుండి టిక్కెట్లు ఆశించి భంగపడ్డ పలువురు బలమైన అభ్యర్థులు ఇండిపెండెంట్ లుగా ఎన్నికల బరిలో నిలిచారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, స్టేషన్ ఘనాపూర్, నర్సంపేట, వర్ధన్నపేట, జనగామ, భూపాలపల్లి, డోర్నకల్, మరిపెడ, కేసముద్రం మున్సిపాలిటీలో అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలకు రెబల్స్ బెడద పట్టి పీడిస్తోంది.