29 March, 2026 | 2:27 AM

అభివృద్ధి పనులను పూర్తి చేయాలి

29-03-2026 12:40 AM
  1. రూ.20 లక్షల వ్యయంతో ఖాద్రి బాగ్‌లో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
  2. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

అంబర్ పేట,మార్చి 28(విజయక్రాంతి): అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శని వారం గోల్నాక డివిజన్లోని ఖాద్రిబాగ్ లో రూ. 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మా ణం పనులను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ గోల్నాక డివిజన్లోని ఖాద్రి బాగ్ ప్రాంతంలో నూతన సీసీ రోడ్డు నిర్మా ణ పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ పనులను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. రోడ్డు నిర్మా ణం పూర్తయిన తర్వాత స్థానికులకు సౌకర్యవంతమైన రాకపోకలు అందుబాటులోకి రానున్నాయన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.