29 May, 2026 | 3:43 AM

కంగనా.. పవర్‌ఫుల్ నర్స్!

29-05-2026 02:43 AM

బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజాచిత్రం ‘భారత్ భాగ్య విధాత’. 26/11 ముంబై దాడుల సమయంలో కామా హాస్పిటల్ వద్ద చోటుచేసుకున్న యథార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు మనోజ్ తపాడియా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. తీవ్రవాద దాడుల సమయంలో కామా హాస్పిటల్‌ను రక్షించి, అందులోని సుమారు 400 మందిని కాపాడిన ఆసుపత్రి సిబ్బంది (అన్‌సీన్ హీరోలు), నర్సుల త్యాగాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు.

ఇందులో కంగనా గాయపడిన నర్సు పాత్రలో నటిస్తున్నారు. తాజాగా గురువారం ఈ మూవీ మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రనౌత్ పవర్‌ఫుల్ అవతార్‌లో ఆకట్టుకుంటున్నారు. నర్స్ యూనిఫామ్‌లో ఉన్న కంగనా.. తన ఒంటిపై గాయా లను లెక్కచేయకుండా, ధైర్యంగా మంటల మధ్య నడుస్తున్నట్టు, రోగులకు సహాయం చేస్తున్నట్టున్న ఈ మోషన్ పోస్టర్.. అమాంతం సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. ఈ సినిమా జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.