పాపన్నగౌడ్ జయంతి వేడుకల్లో కామారెడ్డి గౌడ్‌ల సందడి
రామారెడ్డి, ఆగస్టు 18 (విజయక్రాంతి): సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లాకు చెందిన గౌడ సంఘాల నాయకులు, గౌడ సోదరులు పాల్గొని పాపన్నగౌడ్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ధైర్యసాహసాలు, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటాన్ని నాయకులు స్మరించుకున్నారు. పాపన్నగౌడ్ చరిత్రను భావితరాలకు తెలియజేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నర్సగౌడ్, ఉమాకాంత్ గౌడ్, పెద్ద స్వామి, చక్రధర్ గౌడ్, శ్రీధర్ గౌడ్,సృజన్ గౌడ్, సుధీర్ గౌడ్ లతో పాటు కామారెడ్డి జిల్లా గౌడ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.






