19 August, 2026 | 3:02 AM

బాన్సువాడను తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి

19-08-2026 12:53 AM

మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్

బాన్సువాడ, ఆగస్టు 18 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణాన్ని పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని బాధ్యత అని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని వ్యాపార దుకాణాల సముదాయాల ముందు పరిసరాలను కమిషనర్ గంగాధర్ పర్యటించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు దుకాణ యజమానులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

ప్రతి వ్యాపారి తన దుకాణం ముందు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.దుకాణాల వద్ద చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా ప్రత్యేకంగా చెత్త బుట్టలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ పారిశుధ్య సిబ్బందికి అందజేయాలని సూచించారు. ప్లాస్టిక్ కవర్లు, ఆహార వ్యర్థాలు తదితరాలను డ్రైనేజీ కాలువల్లో వేయడం వల్ల మురుగునీటి సమస్యలు తలెత్తుతాయని, అలాంటి చర్యలకు దూరంగా ఉండాలని దుకాణాల ముందు మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవడంతో పాటు పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని ఆయన తెలిపారు.