9 May, 2026 | 10:21 AM

Breaking News

గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •   భయం అవుట్ భరోసా ఇన్   •   రైతులకు మద్దతు ఏదీ?   •   ఇంటర్ విద్యకు మంగళం!   •  

కామారెడ్డి డిక్లరేషన్ హామీని నిలబెట్టుకోవాలి

18-11-2025 12:29 AM
  1. బీసీ రిజర్వేషన్లపై అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లాలి
  2. కేంద్రంపై పోరాడితే అండగా ఉంటాం
  3. బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి) : బీసీ రిజర్వేషన్లపై సీఎం నేతృత్వంలో అఖిలపక్షం తో ఢిల్లీకి వెళ్లాలని, క్యాబినెట్ సమావేశంలో ఢిల్లీకి వెళ్లే అఖిలపక్ష తేదీని నిర్ణయించాలని బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ హామీని నిలబెట్టుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబులతో జాజుల శ్రీనివాస్ గౌడ్ భేటీ అయ్యారు.

అనంతరం సచివాలయం మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు. డిసెంబరు ఒకటో తేదీ నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఇండి యా కూటమి తరపున బీసీ రిజర్వేషన్లపై పోరాడాలన్నారు. కేంద్రంపై రాష్ర్టం పోరాడి బీసీ రిజర్వే షన్ల చట్టానికి ఆమోదం తెలిపేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని ఆయన సూచించారు. బీసీ రిజర్వేషన్లు పెంచకుండా క్యాబినెట్‌లో స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్‌కు గుణపాఠం చెపుతామని హెచ్చరించారు.

ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీ యాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పోరాడకపోతే బీసీలకు మొదటి ముద్దా యి కాంగ్రెస్ అవుతుందని హెచ్చరించారు. బీసీ బిల్లుకు ఆమోదం తెలపాల్సిన కేంద్రం ఆమోదించకపోతే బీసీలకు మొదటి దోషి బీజేపీనే అవు తుందన్నారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ తన కర్తవ్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలని, లేదంటే బీసీ ల ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ గురి కావాల్సి వస్తుందన్నారు. కేంద్రంపై పోరాడితే కాంగ్రెస్‌కు బీసీ సమాజం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.