13 May, 2026 | 2:04 AM

పేదింటి ఆడపడుచులకు కళ్యాణలక్ష్మి వరం

13-05-2026 12:53 AM

ఎమ్మెల్యే బీఎల్‌ఆర్

మిర్యాలగూడ, మే 12: పేదింటి ఆడపడుచులకు కళ్యాణలక్ష్మి వరం అని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి అన్నారు. మంగళవారం మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని  అడవిదేవులపల్లి మండల వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు మంగళవారం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం గృహలక్ష్మి, ఉచిత బస్సు, పదిలక్షల వడ్డీ లేని రుణాలు తదితర సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల  శ్రీనివాస్,  అధికారులు, మండల నాయకులు, సర్పంచ్ లు, వార్డ్ మెంబెర్స్, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.