ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వివాహిత
కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ రూరల్ మండలంలోని దుర్షేడు గ్రామానికి చెందిన వివాహిత నేతి మానస(23) కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్లు కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఎ. నిరంజన్ రెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం అందింది. వెంటనే స్పందించిన ఇన్‌స్పెక్టర్ బ్లూ కోల్ట్ సిబ్బంది పీసీ అఫ్జల్, హోం గార్డ్ ప్రసాద్లను సంఘటనా స్థలానికి పంపించారు.
వారు వెంటనే అక్కడికి చేరుకుని మహిళను నిప్పంటించుకోకుండా అడ్డుకుని, ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహించి, కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. ఆమెకు ఒక పాప కూడా ఉంది. సమయస్ఫూర్తితో స్పందించి ఒక మహిళ ప్రాణాన్ని కాపాడినందుకు కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఎ. నిరంజన్ రెడ్డి, కానిస్టేబుల్ అబ్జల్, హోంగార్డు ప్రసాద్ లను ఏసిపి విజయ కుమార్, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అభినందించారు.






