27 March, 2026 | 4:08 AM

కాళేశ్వరం హుండీ ఆదాయం రూ.22.93 లక్షలు

27-03-2026 02:19 AM

కాళేశ్వరం, మార్చి 26 (విజయక్రాంతి): శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం హుండీలను గురువారం కార్యనిర్వహణాధికారి మహేష్ ఆధ్వర్యంలో విప్పి నగదు లె క్కింపు చేపట్టారు. హుండీల పర్యవేక్షణాధికారిగా ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. గత 2 నెలలు 10 రోజుల కాలానికి హుండీ ల ద్వారా మొత్తం రూ.22,93,076 నగదు, అమెరికా 61 డాలర్లు లభించినట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో కాళేశ్వరం సర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్ రెడ్డి, యూనియన్ బ్యాంక్ సిబ్బంది, దేవస్థానం అర్చకులు, సి బ్బంది పాల్గొన్నారు. అలాగే శ్రీ వల్లి సేవ ట్రస్ట్ కరీంనగర్, శ్రీ వెంకట అన్నమాచార్య సేవా సమితి, నరసింహ సేవా సమితి హైదరాబాద్, శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు హాజరయ్యారు.