22 April, 2026 | 2:56 AM

జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ‘కాకతీయ’ సత్తా

22-04-2026 12:09 AM

అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు

నిజామాబాద్, ఏప్రిల్ 21(విజయక్రాంతి): ఈ నెల 20న విడుదలైన జేఈఈ మెయిన్స్-2026 ఫలితాలలో నిజామాబాద్ జిల్లా కాకతీయ కళాశాలలో ఇంటర్మీ డియట్ రెండో సంవత్సరం చదువుతూ ఇంటర్‌తో పాటు తొలి ప్రయత్నంలోనే డైరెక్టుగా ఐఐటీ-జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో కాకతీయ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంక్స్ సాధించారని కాకతీయ విద్యా సంస్థల చైర్‌పర్సన్ సీహెచ్ విజయలక్ష్మి తెలిపారు.

అలాగే ఎస్.హేమ ఆల్ ఇండియా ర్యాంక్ 132, రాఖి ఆల్ ఇండియా ర్యాంక్ 1763, రమాదేవి ఆల్ ఇండియా ర్యాంక్ 2800, బి.సంధ్య ఆల్ ఇండియా ర్యాంక్ 2984 సాధించి నిజామాబాద్ కాకతీయ ప్రభంజనం సృష్టించిందన్నారు. ఇంకా ఎస్.ఆర్థిక 4761, హెచ్.భరత్ 6430, శరత్‌చంద్ర 8388, అమృత వర్షిని 9461, సమీక్ష 9463, ఎ. అత్రిజ్ 9955, జె.తన్విత 10292 ర్యాంక్‌లు సాధించినట్లు తెలిపారు.

ఈ ఫలితాలు వేరే జిల్లాలో, వేరే బ్రాంచిలలో సాధించిన ఆల్ ఇండియా ర్యాంక్స్ కాదని.. కేవలం నిజామాబాద్ కాకతీయలో సాధించిన ఆల్ ఇండియా ర్యాంక్స్ మాత్రమే అని మన నిజామాబాద్ తల్లిదండ్రులు గమనించాల్సిందిగా విద్యా సంస్థల చైర్‌పర్సన్ పేర్కొన్నారు. ఇలా 90% పైన 10 మంది కాకతీయ విద్యార్థులు జేఈఈ మెయిన్స్- 2026 ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించగా.. ఇవే కాకుండా ఐఐటీ అడ్వాన్స్‌డ్‌కి 50 మంది కాకతీయ విద్యార్థులు అర్హత సాధించారు.

ఇంతటి అద్భుతమైన విజయాలకు కారకులైన కాకతీయ విద్యార్థినీ విద్యార్థులకు శుభాకాంక్షలు. విశేషమైన కృషినందించిన అధ్యాపక బృందానికి, ప్రోత్సాహా న్ని అందించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. ఈ సందర్భంగా కాకతీయ ఐఐటీ/ మెడికల్ డైరెక్టర్ సీహెచ్ రామోజీరావు(ఐఐటీయన్) మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో అత్యుత్తమ పర్సంటైల్ సాధించి, తమ విద్యార్థులు నిజామాబాద్ స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కేటగిరీలో సత్తా చాటారు అని అన్నారు.

ఇందుకు కృషి చేసిన అందరికీ కాకతీయ అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు. ఈ అభినందన కార్యక్ర మంలో కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్ సీహెచ్ తేజస్విని మాట్లాడుతూ ప్రాథమిక దశ నుంచే ఐఐటీ ఓరియంటెడ్ కోచింగ్ ఇవ్వడం వలన ఇంతటి అద్భుత ఫలితాలను సాధించగలిగాము అని అన్నారు. డైరెక్టర్ సీహెచ్ రాజా, ఐటీ అకాడెమిక్ డీన్ నాగరాజు, ప్రిన్సిపల్స్ సందీప్ కులకర్ణి, వి.రణ ధీష్, వైస్ ప్రిన్సిపాల్ శ్యాం, జ్యోత్స్న, ఐఐటీ అధ్యాపక బృందం పాల్గొన్నారు.