ఉన్నత విద్యలో సంస్కరణలు తీసుకురావాలి
విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగర్, ఏప్రిల్ 21(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులకు విద్యతో పాటు నైపు ణ్యాల్లో శిక్షణ ఇవ్వడానికి అవసరమైన విద్యా ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని శాతవాహన లయన్స్ క్లబ్ సీనియర్ బాధ్యులు లయన్ కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి అన్నారు.
మంగళవారం ఆల్ఫోర్స్ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఏర్పా టు చేసిన సన్మాన కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ పాలక మండలిలో ఈసీ సభ్యుడిగా నియమించబడిన లయన్ ఊట్కూరి రవీందర్ రెడ్డిని ఘనంగా సన్మానించి మాట్లాడుతూ నేటి డిజిటల్ కాలపు యువతలో విద్య, వ్యక్తిగత, సాంకేతిక నైపుణ్యాల్లో ప్రతిభ అత్యవసరమైనదని గుర్తు చేశారు.యూనివర్సిటీ విద్యా ప్రణాళికలో కొన్ని మార్పులను తీసుకువచ్చి ఉద్యోగ సాధన దిశగా అడుగులు పడాలని తెలిపారు.
సన్మాన గ్రహీత లయన్ వి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ డిగ్రీ, పిజీ పాఠ్య ప్రణాళికలో ప్రయోగశాల నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు.ఉన్నత విద్యకు చిరునామాగా శాతవాహన యూనివర్సిటీని నిలపడానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామన్నారు.
క్లబ్ అధ్యక్షులు లయన్ డి తిరుపతి రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కోశాధికారి పి సురెందర్, జీఎల్టీ కోఆర్డినేటర్ ఈ రమేష్,పీఆర్సీ ఎం సత్యనారాయణ రావు, పూర్వ అధ్యక్షులు డాక్టర్ ఎస్ మనోహరా చారి, కోట సత్యం, ఎన్ వేణుగోపాల్, కళాశాల సిబ్బంది, విద్యార్థినీలు పాల్గొని ఘనంగా సన్మానించారు.






