16 July, 2026 | 5:59 PM

టీపీసీసీ నేతలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కీలక ఆదేశాలు

16-07-2026 05:39 PM

హైదరాబాద్: టీపీసీసీ నేతలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎఐసిసి తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు టి. కుమార్ రావు విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం, ఏ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలోనూ పాలాభిషేకాలు, జలాభిషేకాలు నిర్వహించరాదని ఆదేశించారు. ఆహార వృథాకు దారితీసే ఈ పద్ధతులకు బదులుగా అవసరమైన వారికి ఆహార పంపిణీ చేపట్టాలని సూచించారు. అలాగే జేసీబీలు, బుల్డోజర్లు వంటి భారీ యంత్రాలతో నేతలకు భారీ దండలు వేయడం కూడా నిషేధిస్తూ, పాలాభిషేకం వంటి కార్యక్రమాలు కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకమని, టీపీసీసీ సర్క్యూలర్ ను ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.