జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ‘హార్వెస్ట్’ ప్రభంజనం
అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు
ఖమ్మం, ఏప్రిల్ 21(విజయక్రాంతి): 2026-27 విద్యా సంవత్సరానికిగానూ దేశ వ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యనభ్యసించుటకు ఎన్‌టీఏ వారు నిర్వహించిన జేఈఈ మెయిన్స్ 2వ దఫా పరీక్ష లలో తమ విద్యార్థినీ విద్యార్థులు విశేష ప్రతి భ కనబరచి, జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించడం అభినందనీయమని హార్వెస్ట్ కళాశాల యాజమాన్యంవారు తెలియజేశారు.
సోమవారం ప్రకటించిన ఫలితా లలో సీహెచ్ కృష్ణమాదుర్ 99.93 పర్సంటైల్‌తో ఆల్ ఇండియా 1145వ ర్యాంకు, జిల్లా స్థాయిలో రెండవ ర్యాంకు సాధించాడు. వివిధ క్యాటగిరీలలో పి.అన్విదారెడ్డి 99.47 పర్సంటైల్‌తో 1059వ ర్యాంక్, ఎల్.లోకేష్ 99.42 పర్సంటైల్ 2187వ ర్యాంకు, బి.స్ఫూ ర్తి 99.31 పర్సంటైల్ 2685వ ర్యాంకు, యం.సాయిచరణ్ 99.29 పర్సంటైల్ 52వ ర్యాంకు, వి.జగత్ 98.71 పర్సంటైల్, 579 ర్యాంకు, బి.రాంచరణ్ 97.05 పర్సంటైల్‌తో 366వ ర్యాంకుతో పాటు మరెన్నో అత్యుత్త మ ర్యాంకులు సాధించారన్నారు.
కళాశాల నుంచి 30 శాతం విద్యార్థినీ విద్యార్థులు అ డ్వాన్స్‌కి అర్హత సాధించడం అభినందనీయమన్నారు. తమ కళాశాల నుంచి భౌతిక శా స్త్రంలో 99.99 పర్సంటైల్, గణితంలో 99.91 పర్సంటైల్, రసాయనశాస్త్రంలో 99. 80 పర్సంటైల్ సాధించారు. 93.5 అంతకన్నా ఎక్కువ పర్సంటైల్ 20మంది విద్యా ర్థులు సాధించారని తెలియజేశారు.
మంగళవారం కళాశాల ఆవరణలో హార్వెస్ట్ గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థల కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ ఆర్.పార్వతీరెడ్డి విద్యా ర్థులను అభినందించి, అడ్వాన్స్ పరీక్షలో కూడా ఉత్తమ ఫలితాలు సాధించాలని అభిలషించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ క్రమశిక్షణాయుత ప్రణాళిక, నిరంత రం పర్యవేక్షణ, విద్యార్థుల నిరంతర శ్రమ, ఉత్తమ అధ్యాపక బృందం, తల్లిదండ్రుల ప్రో త్సాహం ఈ విజయానికి కారణా లన్నారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.






