calender_icon.png 17 February, 2026 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాగజ్ నగర్ మున్సిపల్ ఉత్కంఠకు తెర

17-02-2026 06:17:02 PM

కాంగ్రెస్.. బీజేపీ మిలాఖత్

చైర్మెన్ కాంగ్రెస్... బీజేపీ వైస్ ఛైర్మన్

కాగజ్ నగర్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ మున్సిపల్ ఉత్కంఠకు తెర పడింది. కాంగ్రెస్, బిజెపి మధ్య అయోధ్య కుదరడంతో మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ  కైవసం చేసుకుంది. వైస్ చైర్మన్ స్థానాన్ని బిజెపి కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్ పర్సన్ గా షాహిన్ సుల్తానా( కాంగ్రెస్), వైస్ చైర్మన్ గా డాక్టర్ అనిత(బీజేపీ) ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని మున్సిపల్ ఎన్నికల అధికారి ఎన్నికల అధికారి తిరుపతి ప్రకటించారు. గురువారం టిఆర్ఎస్ పార్టీకి చెందిన14 కౌన్సిలర్లు, కాంగ్రెస్ 09, బీజేపీ 04, స్వతంత్రులు 02, ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఎమ్మెల్సీ తండా విట్టల్, ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు హాజరయ్యారు.

కాంగ్రెస్, బిజెపి సభ్యులు పార్టీ 18 వ వార్డు కౌన్సిలర్ షాహిన్ సుల్తానా పేరును బలపరచగా16 16 మంది కౌన్సిలర్లు ఆమోదించారు. మెజార్టీ ఉన్నందున షాహిన్ సుల్తానాను చైర్మన్ గా ప్రకటించారు. వైస్ చైర్మన్ కోసం బిజెపి నుంచి గజ్జల లావణ్య, డాక్టర్ అనిత ఇరువురు పోటీపడ్డారు. ఇరు పార్టీలు సమానంగా మద్దతు తెలుపడంతో అధికారులు టాస్ వేయగా డాక్టర్ అనిత ఎన్నికయింది. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ నికత్ పంత్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నిక ప్రక్రియ పూర్తి కావడంతో ఎన్నికైన షాహిన్ సుల్తాన్ వర్గీయులు భారీ ఎత్తున టపాసులు పేల్చి, నిర్వహించారు.