మంత్రి పొన్నం ప్రభాకర్‌కు స్వాగతం పలికిన జుక్కల్ శాసనసభ్యులు
నిజాంసాగర్ జూలై 1 ( విజయ క్రాంతి ): తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు బుధవారం సాయంత్రం ఘన స్వాగతం పలికారు. బాన్సువాడ నియోజకవర్గంలోని కార్యక్రమాలను ముగించుకొని హైదరాబాద్ తిరిగి వెళుతున్న మంత్రిని నిజాంసాగర్ మండలంలోని నరసింగరావు పల్లి చౌరస్తా వద్ద కలుసుకొని గజమాలతో ఘనంగా సత్కరించారు..
కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కార్ కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, ఎన్నారై భుజం గారి భాస్కర్ రెడ్డి, పిట్లం మండల పార్టీ అధ్యక్షులు రామ్ రెడ్డి, నిజాంసాగర్ మండల పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి, పెద్ద కొడప్ గల్ మండల పార్టీ అధ్యక్షులు శామప్ప, మహమ్మద్ నగర్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






