13 May, 2026 | 10:02 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న జడ్జ్ యువరాజ్

14-02-2026 05:08 PM

పెంచికల్పేట,(విజయక్రాంతి): పెంచికల్పేట మండలంలోని ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి ఆలయంను ఆసిఫాబాద్ సివిల్ కోర్టు సీనియర్ జడ్జ్ యువరాజ్ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు కోరుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ పూజలు నిర్వహించి జడ్జ్‌కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ విశిష్టత, చరిత్ర గురించి ఆలయ ప్రతినిధులు వివరించారు. స్థానిక ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు జడ్జ్ యువరాజ్‌ను కలసి ఘనంగా స్వాగతం పలికారు.