అమీర్‌పేట్ అగ్నిప్రమాదంపై స్పందించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్
హైదరాబాద్: అమీర్‌పేట్ మైత్రివనం ప్రాంతంలో గురువారం భారీ అగ్నిప్రమాదం(Ameerpet fire inciden) జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్(Jubilee Hills MLA Naveen Yadav) తక్షణమే ఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితులపై ఆరా తీశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం, సహాయక చర్యల పురోగతి తదితర వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం బాధిత దుకాణ యజమానులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. షార్ట్ సర్య్కూట్ కారణంగా ప్రమాదం జరిగిందని అంటున్నారని, మరికొందరు రెస్టారెంట్ వేడి వల్ల ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెబుతున్నారన్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగలేదని, ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొంటూ, నష్టపోయిన వ్యాపారులకు ప్రభుత్వం తరఫున అందుబాటులో ఉన్న సహాయ సహకారాలు అందించేలా కృషి చేస్తామని నవీన్ యాదవ్ హామీ ఇచ్చారు.






