జర్నలిస్టులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి
ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రవణ్ కుమార్
100 మంది జర్నలిస్టులకు ఉచితంగా వైద్య పరీక్షలు, మందుల పంపిణీ
కామారెడ్డి, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లిమ్రా ఫంక్షన్ హాల్ లో ఆదివారం శ్రీ లక్ష్మీ హాస్పిటల్ 6వ వార్షికోత్సవం సందర్భంగా జర్నలిస్టులకు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు.ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులు తమ వృత్తిలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.ప్రస్తుతం వేసవికాలంలో వడదెబ్బ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్యం బాగుంటేనే వార్తల సేకరణకు సాధ్యమవుతుందని తెలిపారు.
మొదటి ప్రాధాన్యత ఆరోగ్యానికి ఇవ్వాలని ఆయన సూచించారు. జర్నలిస్టులకు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించి ఆరోగ్యపరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందజేయడం పట్ల జర్నలిస్టుల సంఘ నాయకులు ఈ సందర్భంగా ఆయనను అభినందించారు. జర్నలిస్టులు పని ఒత్తిడి తో ఉన్న జర్నలిస్టులు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
పట్టణంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రవణ్ కుమార్ జర్నలిస్టుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారించి తన వంతు సహకారంగా ఉచిత వైద్య పరీక్షలతో పాటు మందులను అందించడం హర్షనీయమన్నారు. వైద్యులకు అన్నివేళలా అండదండలుగా ఉంటూ తమ సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పండ్లరాజు మాట్లాడుతూ జర్నలిస్టులు పని భారంతో తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేసుకోవద్దని సూచించారు.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించడంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొంతమందికి ఇవ్వడం జరిగిందని మళ్లీ కాంగ్రెస్ షబ్బీర్ అలీ సహకారంతో పట్టణ జర్నలిస్టులకు త్వరలోనే ఇళ్ల స్థలాలు అందించడంతోపాటు ఇంటి నిర్మాణం కొరకు ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి అదేవిధంగాకృషి చేస్తామని అన్నారు. జర్నలిస్టుల సంఘ నాయకులు అందరు కలిసి సమిష్టిగా ప్రభుత్వ నుంచి ఇళ్ల స్థలాలు పొందేందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎన్ యూ జె రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేంద్రనాథ్, టిడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు రజనీకాంత్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు పి శ్రీనివాస్, ఉర్దూ దినపత్రిక సియాసాత్ జావిద్ అలీ, సీనియర్ జర్నలిస్ట్, మోసర్ల శ్రీనివాస్ రెడ్డి, అరిమిశెట్టి కృష్ణ, కాంగ్రెస్ నాయకులు కారంగుల అశోక్ రెడ్డి, సత్యం, కోయల్కర్ కన్నయ్య, లక్క పత్ని గంగాధర్, ప్రముఖ వాఖ్యాత అంబీర్ మనోహర్ రావు,జర్నలిస్టు నాయకులు నక్క సిద్ధిరాములు, సడక్ సునీల్, ఇంజమూరి వెంకటేశ్వర్లు, సంగ రాజు,ముదాం వెంకటేశ్వర్లు,ముదాం శంకర్, వేల్పుగొండ రాజు, దిశ రాజు, సురేష్, గోవర్ధన్, కౌసర్, శ్రీకాంత్ రెడ్డి, మజీద్,కౌసర్ అలీ,అన్వర్,హరీష్, ఇంజమూరు శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీకాంత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.






