20 April, 2026 | 8:36 AM

నిమ్స్‌లో కీళ్ల వాతం గర్భధారణపై అవగాహన

20-04-2026 12:06 AM

పంజాగుట్ట, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): కీళ్ల వాతం గర్భధారణపై ఆదివారం పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో అవగాహన సదస్సు నిర్వహించారు. నిమ్స్ క్లినికల్ ఇమ్యునాలజీ అండ్:రుమా టాలజీ విభాగం, ఫెర్నాండెజ్ ఫౌండేషన్ ప్రసూతి విభాగం సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప ఆదివారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నిమ్స్ డీన్ ప్రొఫెసర్ లిజా రాజశేఖర్, ఫెర్నాండెజ్ హాస్పిటల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ తారకేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో పలువురు వైద్యులు, పరిశోధకులు పాల్గొన్నారు.