ఇంటర్మీడియట్ టాపర్‌ను సన్మానించిన డీసీసీ అధ్యక్షుడు
20-04-2026 12:07 AM
నిజాంసాగర్ ఏప్రిల్ 19 (విజయక్రాంతి): నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట ఆదర్శ పాఠశాల ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో కళాశాల టాపర్ గా నిలిచిన మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామానికి చెందిన సానియాను కామారెడ్డి డిసిసి అధ్యక్షులు ఎలె మల్లికార్జున్ ఆదివారం నాడు ఘనంగా సన్మానించారు. ప్రైవేటు కళాశాలకు దీటుగా గ్రామస్థాయిలో విద్యలో రాణించడం ఎంతో గర్వకారణమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని, జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు జుక్కల్ నియోజకవర్గం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారన్నారు.గ్రామస్థాయిలో విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తున్న ఆదర్శ పాఠశాల సిబ్బందికి ఆయన ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు.






