12 August, 2026 | 12:14 PM

జర్నలిస్టులు సంఘటితంగా పనిచేయాలి

12-08-2026 12:47 AM

టీయూడబ్ల్యూజేఐజేయూ 70ఏళ్ల చరిత్ర గల సంఘం

రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ఎ.ఫైజల్

రామచంద్రపురం, ఆగస్టు 11 (విజయక్రాంతి): జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం అందరం కలిసి కట్టుగా  సంఘటితంగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు-ఐజేయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఏ ఫైజల్ అన్నారు. పటాన్చెరు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశాన్ని రామచంద్రాపురంలోని లక్ష్మీ గార్డెన్ లో నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉపాధ్యక్షులు ఫైజల్ మాట్లాడుతూ 70ఏళ్ల చరిత్ర ఉన్న యూనియన్ టీయూడబ్ల్యూజేఐజేయూలో క్రమశిక్షణకు మారుపేరులాంటిందన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు బస్సు పాస్ సౌకర్యం కల్పించడంలో టీయూడబ్ల్యూజేఐజేయూ పాత్ర మరవలేనిదని చెప్పారు. జిల్లాలో అర్హులైన ప్రతీ జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులను ఇప్పించడం జరుగుతుందని అన్నారు.

జర్నలిస్టుల అరోగ్య భద్రత, హక్కుల పరిరక్షణకు పాటుపడుతుందన్నారు. సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు యాదగిరి మాట్లాడుతూ మన సంఘంలో ప్రతి జర్నలిస్టుకు గౌరవం దక్కుతుందన్నారు. జర్నలిస్టుల గౌరవం, భద్రత, హక్కుల విషయంలో అవసరమైనప్పుడు సంఘటితంగా గొంతెత్తాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ మాట్లాడుతూ పటాన్ చెరు జర్నలిస్టుల సమిష్టి కృషితోనే అంచలంచలుగా జిల్లా స్థాయికి ఎదిగానని చెప్పారు.

ఇక్కడి జర్నలిస్టులకు రుణపడి ఉంటానంటూ తెలిపారు. టీయూడబ్ల్యూజేఐజేయూ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి చెన్న బసవేశ్వర్ అధ్యక్షత వహించిన సమావేశంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు ఆసీఫ్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనాథ్, జిల్లా జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా జాయింట్ సెక్రటరీ భూపాల్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్, ఫోటో గ్రాఫర్ జిల్లా అధ్యక్షుడు ఆరీప్, చిన్న,మధ్య తరహా పేపర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సిద్దిఖ్, జనరల్ సెక్రటరీ ఈశ్వర్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.  

అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షునిగా నర్సింహ్మ..

పటాన్ చెరు అసెంబ్లీ టీయూడబ్ల్యూజేఐజేయూ నూతన కార్యవర్గం నూతన అధ్యక్షునిగా పత్తి నర్సింహా, ప్రధానకార్యదర్శిగా యాదగిరి, సలహాదారులుగా కాశీపతి, సులేమాన్,రామారావు, ఉపాధ్యక్షులు గా విఠల్, నగేష్, శివకుమార్, జెమిని రాజు, రమేష్, జాయింట్ సెక్రటరీలుగా వేణు, ప్రభాకర్, శ్రీనివాస్, కోటేష్, శివాజీ, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఆంజనేయులు, గాండ్ల మహేష్, వివేక్, జీవరత్నం, రాజు, కోశాధికారిగా శ్రీనివాస్ రెడ్డి, ఈసీ మెంబర్లు గా శ్రీనివాస్, శంకర్, శేఖర్, మహేందర్ గౌడ్, సిద్దు, శ్రీనివాస్ మామా, రాజశేఖర్, ప్రదీప్ రెడ్డి, విజయ్, నాయుడు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరికి రాష్ట్ర, జిల్లా నాయకులు, తోటి జర్నలిస్టులు శుభాకాంక్షలు తెలిపి అభినందనలు తెలిపారు.