1 June, 2026 | 9:20 PM

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

01-06-2026 08:03 PM

TUWJ(IJU) అధ్యక్షులు జే.వెంకటరత్నం

కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో వివిధ పత్రికలు చానల్స్ లో ,పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని సోమవారం tuwj-iju ఆధ్వర్యంలో కలెక్టర్, ఎస్పీలను పూల బొకేతో శాలువాతో సత్కరించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లా అధ్యక్షులు జే.వెంకటరత్నం మాట్లాడుతూ... అర్హులైన ప్రతి జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు మంజూరు చేయాలని, ప్రతి జర్నలిస్టులకు ఇండ్ల స్థలం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, జర్నలిస్టులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. జర్నలిస్టు పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో, కళాశాలలో 50% ఫీజు రాయితీ కల్పించాలని, జర్నలిస్టు కుటుంబాలకు ప్రైవేటు వైద్యశాలలో రాయితీతో కూడిన వైద్య సౌకర్యం అందించాలని, అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకు రైల్వే పాస్ పునరుద్ధరించాలిని,జర్నలిస్టు వాహనాలకు పోలీస్ స్టిక్కర్ ఏర్పాటు చేయాలిని,ప్రతి జర్నలిస్టులకు బీమా సౌకర్యం కల్పించాలిని అధికారులకు విజ్ఞప్తి చేశారు.