25 April, 2026 | 9:15 PM

Breaking News

కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన సర్పంచ్ ల పోరం అధ్యక్షులు రవితేజ రెడ్డి   •   ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం   •   జనగణనపై షార్ట్ ఫిలిం చిత్రీకరణ   •   చొప్పదండి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌ఐపై ఆరోపణలు   •   కవితక్క రాజకీయ పార్టీ ఆవిర్భవ సభకు తరలిన నేతలు   •   మల్లన్నను దర్శించుకున్న హైకోర్టు జడ్జి   •   చిన్నారుల భవిష్యత్తుపై మానవత్వం చాటుకున్న గ్రామస్తులు   •   చిన్నారులు, గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   ఎమ్మెల్యే పద్మావతి సహకారంతో మౌళిక సదుపాయాలు కల్పిస్తాం   •   పారదర్శకంగా జూనియర్ సానిటరీ ఇన్స్ స్పెక్టర్ పోస్టింగ్ వెబ్ కౌన్సిలింగ్   •  

జాబ్ మేళాలో 116 మందికి ఉద్యోగ అవకాశాలు

20-02-2026 12:00 AM

మహబూబాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా ప్లేస్మెంట్ కెరీర్ ఎక్స్పో 2026 జాబ్ మేళాలో వివిధ సంస్థలు 116 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమానికి లేబర్నెట్ ఫౌండేషన్, జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, ఇడిసి మద్దతు అందించాయి.

మొత్తం 240 మంది నిరుద్యోగ యువత పాల్గొనగా ప్రముఖ సంస్థలు అయిన యంగ్ ఇండియా, టెక్ మహీంద్రా, టెలిపెర్ఫార్మెన్స్, మెడ్ప్లస్, శ్రీరామ్ ఫైనాన్స్ తదితర సంస్థలు నియామక ప్రక్రియ నిర్వహించాయి. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్లో 116 మందికి జాయినింగ్ ఆ ర్డర్లు లభించగా, మొత్తం 48 శాతం ప్లేస్మెంట్ సాధించబడ్డాయి.

ఈ కార్యక్రమాన్ని ఆర్సిఓ పి.రత్నకుమారి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.బిందు మాధురి పర్యవేక్షణలో ట్రైనింగ్, ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ శోభా దేవి సమన్వయంతో, జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ రజిత సహకారంతో,.అధ్యాపకులు, ప్లేస్మెంట్ సెల్, డీఈఈటీ, ఈడీసీ వివిధ కంపెనీల హెచ్.ఆర్. మేనేజర్లు సమిష్టి కృషితో విజయవంతం అయినట్లు తెలిపారు.